
* భగ్నం చేసిన పోలీసులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ (Hyderabad)లో పేలుళ్లకు ఉగ్రవాదులు కుట్ర పన్నారు. ఉగ్రకుట్రను ఐబీ, ఏపీ, తెలంగాణ పోలీసులు సంయుక్తంగా భగ్నం చేశారు. ఇద్దరిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ వ్యాప్తంగా దాడులతో పాటు పేలుళ్లకు ఐసిస్ కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ సంచలన ఆపరేషన్లో పేలుళ్లకు ప్లాన్ చేసిన ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విజయనగరానికి చెందిన సిరాజ్(Siraz), హైదరాబాద్కు చెందిన సమీర్ (Sameer) కలిసి హైదరాబాద్ నగరంలో భారీ పేలుళ్లకు ఫ్లాన్ చేసినట్లు తెలిసింది. ఇందు కోసం విజయనగరంలో సిరాజ్ పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు తెలిపారు. సౌదీ అరేబియా నుంచి సిరాజ్, సమీర్లకు ఐసిస్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలంగాణ కౌంటర్ ఇంటలిజెన్స్ అధికారులు గుర్తించారు. వీరి నుంచి భారీగా ఆయుధాలతోపాటు కీలక సమాచారాన్ని రాబట్టు తెలుస్తోంది. ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.
………………………………………………..