
* కుత్బుల్లా పూర్ లో విషాదం
* గంజాయి తనిఖీలకు వెళ్లిన పోలీసులు
* తనిఖీలు చేస్తుండగానే కుప్పకూలిన కానిస్టేబుల్
* ఆస్పత్రి కి తరలించిన తోటి సిబ్బంది
* కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించిన వైద్యులు
ఆకేరు న్యూస్ హైదరాబాద్ : హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ లో విషాదం చోటుచేసుకుంది. గంజాయి వ్యాపారం జరుగుతోందని సమాచారం అందుకున్న బాలానగర్ పోలీసులు ఆ ఇంటికి వెళ్లి తనిఖీలు చేస్తుండగా ప్రవీణ్ అనే కానిస్టేబుల్ ఒక్కసారిగా కుప్పకూలాడు. ఇది గమనించిన తోటి సిబ్బంది వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా ప్రవీణ్ అప్పటికే గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అనుకోని దుర్ఘటన జరిగి తోటి ఉద్యోగి కళ్లముందే ప్రాణాలు కోల్పోవడంతో మిగతా సిబ్బంది తట్టుకోలేక పోతున్నారు. ఈ ఘటన వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది..
ములుగులో…
ములుగు జిల్లాలో మరో ఘటన జరిగింది. గుండెపోటుతో ఏఆర్ కానిస్టేబుల్ రేగా చుక్కారావు (39) మృతి చెందారు. ములుగు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన స్వస్థలం తాడ్వాయి మండలం కామారం. చుక్కారావు మృతితో ఆ కుటుంబంలో విషాదా ఛాయలు అలుముకున్నాయి.
………………………………………………..