
* డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఫ్యూచర్ సిటీని నెట్‌జీరో సిటీగా నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఐజీబీసీ ఆధ్వర్యంలో నోవాటెల్‌లో నిర్వహిస్తున్న గ్రీన్ తెలంగాణ సమ్మిట్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ‘ప్రపంచానికే ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాం. ప్రభుత్వ అంకితభావం చాటిచెప్పడానికే ఐజీబీసీతో ఫ్యూచర్ సిటీపై ఎంఓయూ కుదుర్చు కున్నాం. రాష్టాభ్రివృద్ధి, అన్ని వర్గాల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు ఉంటాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ఇప్పటికే కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచేలా మినహాయింపునిచ్చాం. రాష్ట్ర ఆదాయం తగ్గుతుందని తెలిసినా.. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఈవీ పాలసీ తీసుకొచ్చాం. హైదరాబాద్ నగర మౌలిక సదుపాయాలను మరింత పెంచేలా రూ.10 వేల కోట్లను కేటాయించాం. మూసీ సుందరీకరణ చేపట్టాం. ఇతర రాష్టాల్రతో పోలిస్తే తెలంగాణలో స్థిరాస్తి రంగం ఆశించిన స్థాయిలో ఉంది. స్థిరాస్తి వ్యాపారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది‘ అని భట్టి అన్నారు.
………………………………………