
* క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన
ఆకేరు న్యూస్,కమలాపూర్ : హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ వద్ద ఉప్పల్ నుంచి ఇతర గ్రామాలకు వెళ్లే ప్రాంతంలో ఉన్న రైల్వే గేట్ వద్ద ఆర్వోబీని నిర్మించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ నేపధ్యంలో హన్మకొండ జిల్లా ఆర్డీవో రమేష్ రాథోడ్, రైల్వే అధికారి అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ మనోజ్ కుమార్ గుప్తా, అధికారులు రైల్వే గేట్ ను సందర్శించి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. దీనికి సంబందించిన నివేదికను ఆర్ అండ్ బీ అధికారులకు పంపనున్నారు.. ఈ ప్రాంతం గుండా నిత్యం రైళ్ల రాకపోకలు అధికంగా ఉంటాయి.. ఉత్తర భారతం నుంచి సికింద్రాబాద్ కు ,అటు చెన్నై కి ,వెళ్లే రైళ్లు ఈ మార్గం గుండానే వెళ్తుంటాయి. రోజుకు పదుల సంఖ్యలో వెళ్తుంటాయి అలాగే గూడ్స్ రైళ్లు కూడా అధికసంఖ్యలో వెళ్తుంటాయి . ఈ నేపధ్యంలో ఈ మార్గం గుండా రాకపోకలు సాగించే ప్రజలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. వ్యవసాయ పనులకు వెళ్లే వారు పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, వ్యా ,పారులకు సమయం వృధా అవుతోంది. ఇక్కడ ఆర్వోబీ నిర్మంచాలని డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఆర్వోబీ నిర్మాణం కోసం శ్రీ మహా లింగమయ్య దేవస్థానం చైర్మన్ పూసాల ప్రకాశం చాలా కాలంగా కృషి చేస్తున్నారు. ఎట్టకేలకు అధికారులు వంతెన నిర్మాణం కోసం క్షేత్ర స్థాయి పరిశీలన జరుపడంతో రైతులు వివిధ గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
…………………………………………………