* లబ్ధిదారుని భర్తను చెట్టుకు కట్టేసిన గుత్తేదారుడు
* ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యదు
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందిరమ్మ కమిటీల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టింది ప్రభుత్వం. ఇళ్లు మంజూరు చేసి ఐదు విడతలుగా డబ్బులు చెల్లిస్తోంది. ఇబ్బందులను దాటుకొని ఇంటిని నిర్మిస్తే.. అష్టకష్టాలూ ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో లబ్ధిదారుని భర్తను చెట్టుకు కట్టేసాడు ఓ ఉత్తేదారుడు. ఈ ఘటన లబ్దిదారుల్లో ఒకింత ఆవేదన..ఆగ్రహం నింపుతోంది.
సోనాల మండలంలో గుత్తేదారుని దాష్టికం..
గుత్తేదారుడు దాష్టికానికి ఒడిగట్టాడు. ఆదిలాబాద్ జిల్లా సొనాల మండలంలోని కోఠ గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. కోఠ గ్రామానికి చెందిన లోకండే మారుతి భార్య పేరు మీద ఇల్లు మంజూరైంది. తనకు మంజూరైన ఇంటి నిర్మాణానికి గాను చింతలబోరి గ్రామానికి చెందిన సత్యనారాయణతో ఒప్పందం చేసకున్నాడు. ఇంటి నిర్మాణం బెస్మెట్ లేవల్ వరకు పూర్తి చేయడంతో లబ్ధిదారుని ఖాతాలో ప్రభుత్వం రూ. లక్ష రూపాయలు జమ చేసింది. విషయం తెలుసుకున్న సత్యనారాయణ ఆ డబ్బులు తనకు ఇవ్వాలని అడిగాడు. సత్యనారాయణ అడిగిన డబ్బులు ఇవ్వకపోవడంతో గొడవకు దారి తీసింది. ఆగ్రహించిన గుత్తేదారుడు సోనాల బస్టాండ్ చౌరస్తా వద్ద చెట్టుకు కట్టేశాడు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు వచ్చి స్టేషన్కు తీసుకెళ్లారు. అనంతరం ఇంటి నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించకపోవడంతో డబ్బులు ఇవ్వలేదని లబ్ధిదారుని భర్త.. పనులు చేసినా.. డబ్బులు ఇవ్వలేదని గుత్తేదారుడు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.
లబ్ధిదారుల ఎంపికకు కమిటీలు..
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను చేపట్టంది. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. కలెక్టర్, ఎంపీడీవో, గ్రామ కార్యదర్శి, స్థానిక కాంగ్రెస్ నాయకులతో ఏర్పాటు చేసింది. ప్రజా పాలనలో స్వీకరించిన దరఖాస్తులను ఇందిరమ్మ కమిటీ పరిశీలించి ఎంపిక చేస్తోంది. ఇల్లు మంజూరైన లబ్దిదారునికి విడతల వారీగా రూ. ఐదు లక్షలు అందిస్తోంది. బేసిమెంట్ కు రూ. లక్ష.. పిల్లర్స్ లెవల్ కు రూ. లక్షా 25 వేలు.. స్లాబ్ లెవల్ లో రూ. లక్షా 75 వేలు తుది దశలో లక్ష రూపాయలను లబ్ధిదారుని ఖాతాలో జమ చేస్తోంది. మహిళా సంఘాల్లోని సభ్యులైతే మరో రూ. లక్ష రూపాయాలను అప్పుగా తీసుకునే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది.
ప్రభుత్వ మార్గదర్శకాలు ఇలా..
ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం ఇంటి నిర్మాణం కోసం ముగ్గు పోసిన తరువాత ఆ స్థలాన్ని ఫొటో తీయాలి.
ఆ ఫొటోను మొబైల్ ఫోన్ ద్వారా ఇందిరమ్మ యాప్ లో జియో కో ఆర్డినేట్ నమోదు చేయాలి. ఇంటి నిర్మాణ వైశాల్యం నాలుగు వందల చదరపు అడుగులకు తగ్గకుండా ఉండేలా నిర్మించుకోవాలి. అందులో రెండు గదులు, ఒక వంట గది, బాత్ రూంను చేపట్టాలి. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారుడు తనకు ఇష్టం వచ్చినట్లు గదులు నిర్మిస్తే ప్రభుత్వం డబ్బులు నిలిపివేస్తోంది. అధికారులకు చూపించిన స్థలంలో కాకుండా మరో స్థలంలో నిర్మించినా.. అవకతవకలకు పాల్పడినా.. అనుమతి రద్దు చేసి మరో లబ్ధిదారునికి మంజూరు చేస్తోంది.
………………………………………………
