
* ఆ పనులు మాత్రం చేయకండి..
* తాజా అధ్యయనంలో వెలుగులోకి కీలక అంశాలు
ఆకేరు న్యూస్, స్పెషల్ స్టోరీ
ఒత్తిడి.. ఆందోళన.. స్ట్రెస్.. పేరు ఏదైనా మెదడును ముప్పుతిప్పలు పెడతాయి. వాటి కారణంగా అనేక దుష్ప్రరిణామాలు తలెత్తుతాయి. మనిషిలో చురుకుదనం మందగిస్తుంది. త్వరగా అలసటకు గురవుతారు. ఏ పని మీదా అంతలా ధ్యాస ఉండదు. జ్ఞాపకశక్తిపైనా ప్రభావం పడుతుంది. ఈక్రమంలో మెదడును ఆరోగ్యంగా ఉంచడంపై కొన్ని పరిశోధనల అనంతరం హార్వర్డ్ హెల్త్ యూనివర్సిటీ (Harward Health University) పలు సూచనలు పేర్కొంటోంది. అలాగే మెదుకు చేటు చేసే పనులను పేర్కొంది. అవేంటో ఓసారి చూద్దామా..?
చేటు చేసే పనులు
ఏదైనా మెదడు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటుంటే, వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
మెదడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. ఆకలి, నిద్ర, శరీర ఉష్ణోగ్రత, హార్మోన్ల సమతుల్యత మెదడు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. బాగా వేయించిన పదార్థాలు, నూనెతో చేసిన ఆహారాల వల్ల కూడా చేటు కలుగుతుంది. ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీలు వీటిలో దేనికి సమస్య ఉన్నా దాని ప్రభావం మెదడుపై పడుతుంది. అందువల్ల శరీర అవయాలపై దృష్టి పెట్టాలి.
మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే..
* మెదడులోని కణాలు ఉత్తేజంగా ఉండేలా చాలెంజింగ్ యాక్టివిటీస్ లు చేయాలి. పజిల్స్, సుడోకు వంటి ఆడుతుంటే మెదడు చురుగ్గా ఉంటుంది. పెయింటింగ్, రైటింగ్, క్రాఫ్ట్స్, తయారీ, సంగీత వాయిద్యాలను ఉపయోగించడం వల్ల కూడా మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. జంక్ ఫుడ్, చక్కెరను పూర్తిగా నిషేధించాలి. అలాగే పురుషులు కూడా వంట చేయడం (Cooking) వల్ల మెదడు ఉత్తేజితం అవుతుందని హెల్త్ వర్సిటీలో పరిశోధనలో తేలింది.
* ఆటలు, వ్యాయామం, ఈత, డ్యాన్స్, యోగా వంటివి మెదడుకు రక్తసరఫరాను వేగవంతం చేస్తాయి. ఏకాగ్రత పెరిగి, బ్రెయిన్ చురుగ్గా ఉంటుంది.
* మెదడు ఆరోగ్యంలో పోషకాహారం ప్రధాన పాత్ర పోషిస్తుంది. తాజా కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్లు, గింజలు, తృణ ధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకోవాలి.
* రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను అదుపులో ఉంచుకోవాలి. వీటి వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది.
* ధూమపానం, మధ్యపానం వంటివి మెదడును తీవ్రంగా దెబ్బతీస్తాయి. ఆలోచనాశక్తి క్షీణించేలా చేస్తాయి. రోజుకు ఏడు నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి.
* ప్రధానంగా రోజూ ఎక్కువ మందితో మాట్లాడడం, కుటుంబ సభ్యులు, స్నేహితులతో సమయం గడపడం, స్క్రీన్ టైంను తగ్గించడం వంటివి మెదడును చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచుతాయి.
……………………………………………………..