
* ఆసియాలో విజృంభణ
* హాంకాంగ్, సింగపూర్ లో జోరుగా కొవిడ్ కేసులు
ఆకేరు న్యూస్, డెస్క్ : కరోనా చావలేదా.. వ్యాక్సిన్లు, బూస్టర్ల డోస్ లతో పారిపోలేదా.. అంటే లేదని స్పష్టం అవుతోంది. రూపం మార్చుకుని, కొత్త వేరియంట్ తో మళ్లీ విజృంభిస్తోంది. ఆసియాలో కరోనా మళ్లీ మొదలైంది. హాంకాంగ్(Hangkong), సింగపూర్(Singapur) కొవిడ్ కేసులు జోరుగా పెరుగుతున్నాయి. బూస్టర్ డోస్ లు తీసుకోవాలని అక్కడి అధికారులు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. హాంకాంగ్, సింగపూర్లల్లోనే కాకుండా ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త కోవిడ్ వేవ్ భయాలు ఎక్కువయ్యాయి. వేసవి కాలం కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతుండటం మరింత కలవరం పెడుతోంది. మే 3 నుంచి మరణాలతో సహా కేసులు అధిక సంఖ్యలో నమోదైనట్లు అక్కడి ఆరోగ్యశాఖ ప్రకటించింది. 7 మిలియన్లకు పైగా జనాభా ఉన్న నగరంలో గత రెండేళ్లలో నమోదైన కేసులతో పోలిస్తే సంఖ్య తక్కువే అయినా, వైరల్ లోడ్, కోవిడ్ సంబంధిత అనారోగ్యం, ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య బాగా పెరిగిందని అధికారులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organisation) డేటా ప్రకారం సార్స్ కొవిడ్-2 పాజిటివిటీ రేటు 7.3% నుండి 5.0%కి తగ్గినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఈ వైరస్ కొత్త వేరియంట్ JN.1, వేరియంట్ ఆఫ్ ఇంటరెస్ట్..VOI గా వర్గీకరించబడింది, 2025లో 16.3% సీక్వెన్స్‌లలో కనిపించిందీ వైరస్. అలాగే, LP.8.1, LB.1 వంటి వేరియంట్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయి.
…………………………………………………