
* రోజురోజుకీ పెరుగుతున్న పాజిటివ్ కేసులు
* విస్తరిస్తున్న వైరస్
* మాస్క్లు ధరించాలని వైద్యుల సూచన
* స్వీయ నియంత్రణ తప్పనిసరి
ఆకేరు న్యూస్ డెస్క్: కరోనా సృష్టించిన కల్లోలం నుంచి దేశం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నేపధ్యంలో మళ్లీ కరోనా మహమ్మారి దేశంలో విస్తరిస్తోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే కాస్త ఉపశమనం పొందుతున్న ప్రజలు మళ్లీ ఏ ఉపద్రవం ముంచుకొస్తుందోనని భయాందోళనలు చెందుతున్నారు. గత 24 గంటల్లో 500కిపైగా కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం ఈ ఏడాది కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య ఐదు వేలకు చేరినట్లు తెలుస్తోంది.. కేరళలో 1,487 కేసులు . ఢిల్లీలో 562, పశ్చిమ బెంగాల్లో 538, మహారాష్ట్రలో 526, గుజరాత్లో 508, కర్ణాటకలో 436, తమిళనాడులో 213 కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది కరోనాతో 51 మంది మరణించారు. ఏది ఏమైనా వర్షాకాలంలో సీజినల్ జ్వరాలు ప్రబలే అవకాశాలు ఎక్కువ.. ఈ నేపద్యంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడం కొంచెం ఆందోళన కలిగిస్తోంది.
………………………………………….