* పత్తి రైతులతో మంత్రి తుమ్మల వీడియో కాన్ఫరెన్స్
* పత్తి తడవకుండా చూసుకోవాలని సూచన
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మొంథా తుఫాన్ నేపధ్యంలో తెలంగాణలో పత్తి రైతులు జాగ్రత్తగా ఉండాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రైతులకు సూచించారు,సచివాలయంలో మంగళవారం రైతు నేస్తం కార్యక్రమంలో మంత్రి తుమ్మల ఖమ్మం, మంచిర్యాల, కామారెడ్డి, నల్గొండ వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, రైతులతో మాట్లాడి వారి సందేహాలు నివృత్తి చేశారు. తుఫాన్ ప్రభావంతో చేతి కందిన పత్తి తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తేమ శాతం 12 శాతం మించకుండా చూడాలని కోరారు.మారిన వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తేమ శాతం 20 వరకు ఉన్నప్పటికి పత్తి కొనుగోళ్లు జరపాలని మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
ఈ వానాకాలం సీజన్ పత్తి కొనుగోళ్లు సీసీఐ ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 72 జిన్నింగ్ మిల్లుల్లో కొనుగోళ్లు ప్రారంబించారు.784 మంది రైతులకు చెందిన 1623 క్వింటాళ్ల పత్తి తొలిరోజు కొనుగోలు చేశారు. పత్తి కొనుగోళ్లకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 318 జిన్నింగ్ మిల్లులు నోటిఫై చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేయగా 28 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనాలు.ఈ ఏడాది అధిక వర్షాల కారణంగా పత్తి దిగుబడులు తగ్గడం ,మారిన వాతావరణ పరిస్థితులు దృష్ట్యా తేమ శాతం విషయంలో 12 శాతం పైగా ఉన్న పత్తినీ కూడా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు జరపాలని కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ చౌహాన్ కు లేఖ రాసినట్లు తెలిపారు.చ రైతులందరూ కిసాన్ యాప్ ను ఉపయోగించుకోవాలని సూచించారు.పత్తి రైతులు కపాస్ కిసాన్ యాప్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారిక బృందాలు జిల్లాలో పర్యటించి ఏ ఈవో లు మార్కెట్ సెక్రటరీలు ,జిల్లా మార్కెటింగ్ అధికారులు రైతులకు అందుబాటులో ఉంటారని మంత్రి తుమ్మల ప్రకటించారు.రైతులు యాప్ లో నమోదు చేసుకుంటే పత్తి అమ్ముకోవడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని తెలిపారు.
నేటి నుంచి సోయాబీన్ కొనుగోళ్లు..
నేటి నుంచి సోయాబీన్ కొనుగోళ్లు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ప్రైస్ సపోర్ట్ స్కీమ్ లో మొక్కజొన్న జొన్నలు చేర్చాలని సోయా పై ఉన్న పరిమితులు ఎత్తి వేయాలని మంత్రి తుమ్మల కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు
టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు..
పత్తి రైతులకు ఎలాంటి సమస్యలు తలెత్తినా రైతుల సౌకర్యార్థం టోల్ ఫ్రీ నెంబర్ 1800 599 5779 కి కాల్ చేయొచ్చని మంత్రి తుమ్మల ప్రకటించారు. పత్తి రైతులు ప్రభుత్వ మద్దతు ధరకు అమ్ముకునేలా ప్రజా ప్రభుత్వం లో అన్ని చర్యలు తీసుకున్నట్లు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్తి రైతులు పత్తి అమ్ముకునేలా సీసీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
…………………………………………….
