ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్‌కు హైకోర్టు అనుమతినిచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఈ నెల 9వ తేదీన విచారణకు రావాలని ఏసీబీ నిన్న నోటీసులు పంపించింది. కాగా, ఈ విచారణకు లాయర్లతో హాజరయ్యేందుకు అనుమతించాలని కేటీఆర్ లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. కేటీఆర్ వేసిన లంచ్ మోషన్ పిటిషన్‌కు హైకోర్టు అంగీకరించింది. మధ్యాహ్నం 2.30 గంటలకు ఈ పిటిషన్‌పై విచారణ జరుపుతామని తెలిపింది. అలాగే ఫార్ములా ఈ-కార్ రేస్‌పై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ పెట్టాలని కోరితే ముఖ్యమంత్రి ఎందుకు పారిపోయారని, రేవంత్‌రెడ్డికి దమ్ముంటే.. ఆయన జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో మీడియా సమక్షంలో చర్చ పెడితే తాను రెడీ అని కేటీఆర్ సవాల్ చేశారు. ఆ తర్వాత ఏసీబీ విచారణకైనా, ఈడీ విచారణకైనా సిద్ధమేనని స్పష్టంచేశారు.
……………………………………..