 
                * గోమాతాను రక్షించుకోవాలి
* మాతా అన్నపూర్ణేశ్వరీ, కాశీవిశ్వనాథ పీఠాధిపతి శ్రీ దుర్గానంద స్వామి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : దేశంలో గో రక్షా చట్టాలున్నా.. అమల్లో విఫలమవుతున్నాయని మాతా అన్నపూర్ణేశ్వరీ, కాశీవిశ్వనాథ పీఠాధిపతి శ్రీ దుర్గానంద స్వామి అన్నారు. హైదరాబాద్ లోని ప్రెస్భవన్లో గోరక్ష సంస్థ దళ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గోవులను రక్షించుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గో రక్షకులపై ఎంఐఎం గూండాలు దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఈనెల 22న గో రక్షకునిపై దాడి ఘటనపై మండిపడ్డారు. గోరక్షకులపై దాడులు చేస్తే ప్రభుత్వం..పోలీస్ ఏం చేస్తున్నారని.. ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే కఠినంగా వ్యవహారించాల్సిన అవసరం ఉందన్నారు. గోరక్షా దళ్ నాయకులు ప్రభుత్వం భద్రత కల్పించాలన్నారు. పీఠాధిపతి వెంట గో రక్షదళ్ రాష్ట్ర నాయకులు పవన్ రెడ్డి, గో రక్ష నాయకులు పాల్గొన్నారు.

……………………………………………

 
                     
                     
                    