* పిచ్చి రీల్స్ పై సజ్జనార్ ఫైర్
* వీడియో పోస్ట్ చేసి హెచ్చరికలు
అకేరు న్యూస్, హైదరాబాద్ : సోషల్ మీడియా లో యువత వెర్రి చేష్టలు, లైక్స్ కోసం చేసే పిచ్చి రీల్స్ పై స్పందించే హైదరాబాద్ సీపీ సజ్జనార్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. కన్నబిడ్డలను బావి అంచున నిలబెట్టి రీల్స్ చేయడంపై నిలదీశారు. “సాహసం కాదు.. అది మూర్ఖత్వం. ఆత్మహత్యాసదృశ్యం.” అన్నారు. పిల్లలకు రక్షణగా ఉండాల్సిన పెద్దలే వారిని మృత్యువు అంచున నిలబెట్టడం చూస్తుంటే, సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు… సోషల్ మీడియా పిచ్చిని ప్రాణాల మీదకు తెచ్చుకోకండి. ఇలాంటి ఉన్మాద చర్యలను ప్రోత్సహించకండి ” అని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా అయన పోస్ట్ చేశారు. ఓ వీడియో కూడా పోస్ట్ చేశారు.
