maize procurement CPM demand
అకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
షరతులు లేకుండా మొక్కజొన్నలను కొనుగోలు చేయాలని సీపీఎం మండల కార్యదర్శి మునిగల రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ ను సీపీఎం బృందం సందర్శించింది. మొక్కజొన్న రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ ఆరుగాల కష్టపడిన రైతులు మార్కెట్ కు మొక్కజొన్న ధాన్యాన్ని తెస్తే ఫంగస్, సన్నాళ్ల పేరుతో మార్క్ఫెడ్ ఇన్చార్జి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని అన్నారు. గ్రామాల నుండి మార్కెట్ వరకు తెచ్చేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని స్థానిక ఎమ్మెల్యే పది రోజుల కిందటనే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన అధికారులు మార్కెట్ ఇన్చార్జి కొనుగోలులో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ పై అధికారులు స్పందించి మార్క్ఫెడ్ బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. షరతులు లేకుండా మార్కెట్కు వచ్చిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రేపు సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యులు కత్తుల రాజు, తోడెంగల ఐలయ్య, రైతు సంఘం నాయకులు రైతులు మంద మొగిలి, నీరటి సంపత్, దాసరి కోరయ్య, కాసు నాగరాజు, సంపత్ రైతులు తదితరులు పాల్గొన్నారు.
