 
                * మార్నింగ్ వాక్ చేస్తుండగా గొంతుకోసి చంపిన దుండగులు
* మరో మూడు రోజుల్లో మనవరాలి పెళ్లి
ఆకేరు న్యూస్, ఖమ్మం : ఖమ్మం జిల్లాలో దారుణం జరిగింది. ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం చింతకాని మండలం పాతర్లపాడు గ్రామంలో సీపీఎం సీనియర్ నేత, రైతు సంఘం నాయకుడు సామినేని రామారావు ను ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. సామినేని రామారావు సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రైతు సంఘం ప్రధాన   కార్యదర్శిగా పనిచేశారు. పాతర్లపాడు గ్రామానికి సర్పంచ్ గా పనిచేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో హత్య జరగడం సంచలనం రేపింది. హత్యకు స్థానిక రాజకీయాలే కారణమా
లేక ఇతర కారణాలు ఉన్నాయా అనేది తెలియరాలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు 
వివరాలు సేకరిస్తున్నారు. ఘటనా స్థలంలో డాగ్ స్వ్కాడ్ కూడా తనిఖీలు చేపట్టింది. జిల్లాకు చెందిన
సీపీఎం నాయకులందరూ సామినేని రామారావు ఇంటికి చేరుకుంటున్నారు. మరో మూడు రోజుల్లో
మనవరాలి పెళ్లి ఉండగా ఈ హత్య జరగడంతో ఆ ఇంట్లో విషాధ ఛాయలు అలుముకున్నాయి. 
సామినేని రామారావు హత్యపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
…………………………………………………..

 
                     
                     
                    