* గత నెల అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ చేరిక
* చికిత్స పొందుతూ తుదిశ్వాస
* కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం
ఆకేరున్యూస్, ఢిల్లీ: సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) మృతి చెందారు. గత నెల అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్ చేరిన ఆయన సెప్టెంబర్ 12వ తేదీ గురువారం చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. దీంతో
కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి శ్వాసకోశ సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. అతడి ఆరోగ్యం క్షీనిస్తుండడంతో వెంటిలేటర్‌పై వైద్యులు చికిత్స అందించారు. చివరికి పరిస్థితి విషమించడంతో చనిపోయారు. దీంతో కమ్యూనిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.
సీతారాం ఏచూరి 1952 ఆగస్టు 12వ తేదీన చెన్నయ్ లో జన్మించారు. పదో తరగతి వరకు హైదరాబాద్ లో చదివారు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ లో ఉత్తీర్ణత సాధించారు. జేఎన్‌యూలో ఎంఏ ఎకనామిక్స్ చదివారు. 1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)లో చేరారు. జేఎన్‌యూలో మూడు సార్లు స్టూడెంట్ యూనియన్ నాయకుడిగా విజయం సాధించారు. 1985లో భారత కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీకి ప్రాతినిధ్యం వహించారు. 2005 సంవత్సంలో వెస్ట్ బెంగాల్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2015, 2018, 2022లో సీపీఎం జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు.
——————————-