
* జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష
ఆకేరున్యూస్ రామగుండం : గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో చేపట్టిన క్రిటికల్ కేర్ విభాగం పనులను ఆగస్టు 15 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ( KOYA SRI HARSHA)సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం ఆయన రామగుండం ( RAMAGUNDAM),గోదావరి ఖని (GODAVARIKHANI)నగరాల్లో విస్తృతంగా పర్యటించారు. రామగుండం నగరంలోని గోదావరిఖని జనరల్ ఆసుపత్రి, తహసిల్దార్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరిఖని జనరల్ ఆసుపత్రి లో నూతన క్రిటికల్ కేర్ భవనాన్ని ఆగస్టు 15 వరకు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.ఆసుపత్రిలో గైనిక్ పోస్ట్ ఆపరేటివ్ వార్డు, ఎస్.ఎన్.సి.యూ వార్డు లను, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ ఓపి విభాగాలను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో అవసరమైన సిబ్బందిని నియమించామని రోగులకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అన్నారు.
రామగుండం తహసిల్దార్ కార్యాలయంలో (THAHASILDAR OFFICE )…
భూ భారతి పెండింగ్ దరఖాస్తులను కలెక్టర్ పరిశీలించారు. చట్టం నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి రోజూ నిర్ణీత సంఖ్యలో దరఖాస్తులను డిస్పోస్ చేసే విధంగా ప్రణాళిక తయారు చేసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. రామగుండం మున్సిపల్ కార్యాలయంలో కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, డా.రాజు, తహసిల్దార్ ఈశ్వర్ , తదితరులు పాల్గొన్నారు.
…………………………………