* వ్యాన్, లారీ ఢీ.. వ్యాన్ బోల్తా పడడంతో వెలుగులోకి..
ఆకేరు న్యూస్, రాజమండ్రి : ఆ రోడ్డుపై అకస్మాత్తుగా జరిగిన ప్రమాదంతో ఎవరికి ఏం జరిగిందో అని స్థానికులు ఉరుకులు, పరుగులు పెట్టారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. వ్యాన్ బోల్తా పడడంతో పక్కకు తొలగిస్తున్నారు. ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అట్టపెట్టెలో నోట్ల కట్టలు ( Currency bundles )చూసి కళ్లు జిగేల్ మన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో నాటకీయ పరిణామాల మధ్య పెద్ద ఎత్తున క్యాష్ పట్టుబడటం ఇప్పుడు సంచలనంగా మారింది. వ్యాన్, లారీ ఢీ కొనడంతో బస్తాల నుంచి కోట్ల కొలదీ నోట్ల కట్టలు బయటపడ్డాయి. నల్లజర్ల మండలం అనంతపల్లి ఎర్రకాలువ వద్ద లారీ, వ్యాన్ను వెనుక నుంచి ఢీ కొనడంతో ఈ నగదు బయటపడింది. హైదరాబాదు నుంచి మండపేట వైపు కెమికల్ ఫౌడర్ బస్తాలను తరలిస్తున్న వ్యాన్ లారీ ఢీకొనడంతో తిరగబడిండి. అందులో ఉన్న బస్తాల కింద 7 అట్ట పెట్టెలు లభ్యం అయ్యాయి. వాటిల్లో పెద్ద ఎత్తున నగదు ఉండటంతో.. పోలీసులు స్వాధీనం చేసుకుని టోల్ ప్లాజా అడ్మినిస్ట్రేటివ్ భవనం వద్దకు తరలించారు. అధికారుల సమక్షంలో అన్ని పెట్టెలను తెరిచి చూడగా వాటిల్లో కోట్లాది రూపాయల నగదు కనిపించింది. ఇది ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు తీసుకెళ్తున్న నగదుగా అధికారులు గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తరలిస్తున్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
——————–