* ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్
ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన రాజీనామా పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయానికి లోబడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. సీఎం ఆదేశిస్తే తక్షణమే రాజీనామా చేసేందుకు వెనుకాడబోనని తేల్చిచెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘నా అనర్హత అంశంపై సుప్రీంకోర్టులో, స్పీకర్ వద్ద పిటిషన్లు పెండిరగ్లో ఉన్నాయి. న్యాయస్థానంలో నా వాదనలు వినిపిస్తాను. అయితే, సందర్భాన్ని బట్టి, అన్నింటికంటే ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటాను,’’ అని అన్నారు.ఎన్నికలను ఎదుర్కోవడం తనకు కొత్తేమీ కాదని, తన రాజకీయ జీవితంలో 11 సార్లు ఎన్నికల బరిలో నిలిచిన అనుభవం ఉందని దానం గుర్తుచేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రేవంత్ రెడ్డి మరో పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిన అవసరం ఉందని, ఆయన నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి పథంలో పయనిస్తుందని దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు.
……………………………………
