* సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు
* మతపరమైన ర్యాలీల్లో డీజేలపై ఆసక్తికర చర్చ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మతపరమైన ర్యాలీల్లో డీజేలు నిర్వహించి.. పబ్బుల్లో వేసినట్లు డ్యాన్స్ లు వేస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్(Hyderabad Police commissinor Cv Anand) కీలక వ్యాఖ్యలు చేశారు. మతపరమైన ర్యాలీల్లో డీజేలు పెట్టి డ్యాన్స్ లు వేస్తుండడంపై కొంత కాలంగా చర్చ నడుస్తోంది. యువత అలా నృత్యాలు చేస్తుండడాన్ని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Mp Asaduddin owaisi) సహా పలువురు ప్రముఖులు తప్పుబట్టారు. ఈనేపథ్యంలో సీవీ ఆనంద్ నేతృత్వంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. డీసీఎం వాహనాలకు భారీ సౌండ్ బాక్స్ లతో డీజేలు పెట్టి, దాదాపు 15 నుంచి 20 గంటలు నృత్యాలు చేస్తున్నారని, దాని వల్ల శబ్ద కాలుష్యమే కాదు.. చెవులకు చిల్లులు పడుతున్నాయని, గుండె కదులుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
పండగలను పవిత్రతతో చేసుకోవాలని, డీజే సౌండ్స్ వినియోగంలో పరిమితి ఉండాలని సూచించారు. గణేష్ ఉత్సవాల్లోనే కాదు.. మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో కూడా.. డీజేలు పెట్టి నృత్యాలు, పబ్బుల్లో మాదిరిగా నృత్యాలు చేయడం చూసి మత పెద్దలు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారని తెలిపారు. అందరూ ఏకధాటిపైకి వచ్చి పోలీసులు, ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారని వెల్లడించారు. ఈరోజు అన్ని ఆర్గనైజేషన్ల పెద్దలు, ఉత్సవ కమిటీ, రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశామని, మతపరమైన ర్యాలీలో డీజేల(Djs) వాడకంపై చర్చించి, ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని తెలిపారు.
………………………………