
* డాక్టర్ అంపశయ్య నవీన్
* హన్మకొండ కేడీసీలో దాశరథి జయంతి ఉత్సవాలు
ఆకేరు న్యూస్ హనుమకొండ : మహాకవి దాశరథిని అందరూ స్ఫూర్తి గా తీసుకోవాలని కేంద్ర సాహిత్యవార్డు గ్రహీత డాక్టర్ అంపశయ్య నవీన్ అన్నారు.శుక్రవారం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో దాశరథి జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో నిజాం పాలనా కాలంలో దాశరధి కృష్ణమాచార్య పోరాట పటిమ గొప్పదని సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారనిఅన్నారు.నా తెలంగాణ కోటి రతనాల వీణ అని నినదించిన దాశరథి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు విభాగం అధిపతి డాక్టర్ లెంక సత్యనారాయణ,పరీక్షల విభాగం అధిపతి డాక్టర్ శివనాగ శ్రీను,అధ్యాపకులు డాక్టర్ సమత, సాయిలు తారాములు,రమేష్మహేందర్ శ్రీనివాస్,కృష్ణయ్య గాయత్రీదేవి,నాగమణి ఎడమ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు క్విజ్ పోటీలు నిర్వహించారు. విజేతులకు అవంపశయ్యనవీన్ చేతుల మీదుగా బహుమతలు అందజేశారు. అంతకు ముందు ఈ కార్యక్రమాన్ని ఆచార్య జీ.శ్రీనివాస్ ప్రారంభించారు.
…………………………………….