* ఇద్దరికీ ప్రధాన పార్టీల మద్దతు
ఆకేరు న్యూస్. జగిత్యాల : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికల్లో ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకుంటున్నాయి. జగిత్యాల జిల్లా తిమ్మయ్య పల్లెలో సర్పంచ్ పదవికి తల్లీ,కూతురు ఎదురెదురుగా బరిలో దిగడంతో పోరు రసవత్తరంగా మారింది. బీసీ మహిళ రిజర్వేషన్ రావడంతో తల్లి గంగవ్వ, ఆమె కూతురు సుమలత ఇద్దరూ పోటీకి సై అన్నారు.ఎన్నికల్లో బంధుత్వాన్నీ కూడా పట్టించుకోవడం లేదు. వచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. పంచాయితీ ఎన్నికల్లో అన్నాతమ్ముళ్లు, బావామరుదులు.వేరు వేరు పార్టీల మద్దతులో తలపడటం ఇప్పటివరకు చూశాం.దీంతో పోరు రసవత్తరంగా మారింది.మరి తల్లి గెలుస్తుందా?కూతురు గెలుస్తుందా? అన్న చర్చ గ్రామస్థుల్లో నడుస్తోంది.
………………………………………………………………..
