
* కుటుంబంలో నలుగురి ఆత్మహత్య
* బలి తీసుకున్న వివాహేతర సంబంధం
ఆకేరు న్యూస్, డెస్క్ : కొన్ని వివాహ బంధాలు దారి తప్పుతున్నాయి. వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నాయి. దీంతో కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. హత్యలకో, ఆత్మహత్యలకో పురిగొల్పుతున్నాయి. మధ్యప్రదేశ్లో జరిగిన సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఎదిగిన కుమార్తె, కుమారుడు ఉన్న ఓ తల్లి.. భర్త స్నేహితుడు సురేంద్రతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. వారిద్దరూ తరచూ కలిసేవారు. ఇంట్లోనే ప్రియుడితో పడకగదిలో అభ్యంతరకర స్థితిలో ఉన్న తల్లిని చూసి కుమార్తె షాక్ కు గురైంది. వెంటనే ఈ విషయాన్ని నాన్నకు చెప్పింది. దీంతో అతడు భార్యను మందలించాడు. సురేంద్రతో పనికిమాలిన సంబంధం మానుకోవాలని హితవు పలికాడు. అయినా వాళ్లు ఆపలేదు. భర్త పదే పదే మందలిస్తుండడంతో వరకట్న వేధింపుల కేసు పెడతానని ఉల్టా భర్తను బెదిరించింది. ఆమె ప్రవర్తన సరిగా లేకపోవడంతో మానసిక క్షోభను గురైన ఆమె భర్త (45), అత్త (70), కుమార్తె (18), కుమారుడు (16) ఆత్మహత్యకు పాల్పడ్డారు. గత నెలలో జరిగిన ఈ ఘటనలో తాజాగా ఆమెను, ప్రియుడు సురేంద్రను పోలీసులు అరెస్టు చేశారు.
……………………………………………..