* వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి కవిత
ఆకేరున్యూస్, వరంగల్: వరంగల్‌లో ఏటీఎం కేంద్రాల్లో చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన అంతర్ రాష్ట్ర ముఠాకు చెందిన ఏడుగురు నేరస్థులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసు కమిషనరేట్‌కు చెందిన సిసిఎస్, కాజీపేట పోలీసులు సంయుక్తంగా వీరిని పట్టుకొని రూ. 5లక్షల 10వేల రూపాయల నగదు, రెండు కార్లు, ఏడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నేరానికి వినియోగించే ఐరన్ ప్లెట్లను, డూప్లికేట్ తాళం చెవులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో ఆరిఫ్ ఖాన్, సర్ఫరాజ్, యం.ఆష్ మహ్మద్, షాపుస్ ఖాన్, షారూఖాన్, అస్లాం ఖాన్, యం. షారుఖాస్లు ఉన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులందరూ మాల్కిడా తాలుకా, అల్వార్ జిల్లా, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు.అరెస్ట్ చేసిన నిందితులందరూ ఒకే ప్రాంతానికి చెందిన వారని వరంగల్ సెంట్రల్ జోన్ డిసిపి కవిత తెలిపారు. పోలీస్ కమిషనరేట్‌లో విలేకరులతో మాట్లాడారు. వారందరికీ పరిచయం ఉండటంతో నిందితులందరూ కలిసి మద్యం సేవిస్తూ జల్సాలు చేసేవారన్నారు. వీరి సంపాదన వీరి జల్సాలకు సరిపోకపోవడంతో నిందితులు సులభంగా డబ్బు సంపాదించాలని అనుకున్నారన్నారు. ఓ పరిచయస్తుడి ద్వారా ఎస్.బి.ఐ బ్యాంక్‌కు సంబంధించిన ఏటీయం కేంద్రాల్లో ఏర్పాటు చేసే మిషన్లకు సంబందించి లోపాలను ఈ ముఠా సభ్యులు అధ్యానయం చేశారన్నారు.పేర్ కంపెనీ చెందిన ఏటీఎం మిషన్‌లో తెరుచేందుకు వీలుగా నకిలీ తాళం చెవులను తయారు చేసుకున్నారన్నారు. ఈ ముఠా ముందుగా ఆ కంపెనీ చెందిన ఏటీఎం మిషన్ ఉన్న కేంద్రాలకు వెళ్లి నిందితులు తమ వద్ద ఉన్న నకిలీ తాళంతో మిషన్ ముందు భాగంలో తెరిచి డబ్బులు బయటకు వచ్చే మార్గంలో ఏవరు గుర్తుపట్టని విధంగా ఓ ఇనుప ప్లెటును గమ్ పెట్టి అమర్చేవారన్నారు.ఈ విధంగా అమర్చడం ద్వారా బ్యాంక్ ఖాతాదారులు డబ్బు ఏటీయంలో డ్రా చేసుకునే సమయంలో ఇనుప ప్లెటు కారణంగా ఏటీయం మిషన్ రావల్సిన డబ్బు బయటకు రాకుండా మిషన్ లోపలే నిలిపోవడం జరుగుతుందన్నారు. ఏటీయం మిషన్ నుండి డబ్బు బయటికి రాకపోవడంతో బ్యాంక్ ఖాతాదారుడు మిషన్ సమస్యగా భావించి అక్కడి నుండి వెళ్ళిపోయేవారన్నారు. అదే ఏటీయం పరిసర ప్రాంతాల్లో గమనిస్తూ ఉంటూ వున్న ముఠా సభ్యులు ఖాతాదారుడు ఏటీయం కేంద్రం నుండి వెళ్ళిపోగానే ఈ ముఠా ఏటీయంలోకి వెళ్ళి తమ వద్ద ఉన్న తాళంతో తెరచి అందులో నిలిచిపోయిన డబ్బును చోరీ చేసేవారన్నారు.ఆ తరువాత ఖాతాదారుడుకి ఏటీయం సెంటర్ నుండి నగదు డ్రా చేసినట్లుగా ఫోన్‌కు మేసెజ్ రావడం కూడా జరుగుతుందన్నారు. ఖాతాదారులు బ్యాంకుకు ఫిర్యాదులు చేశారన్నారు. నిందితులు రాజస్థాన్ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడటం జరిగిందన్నారు. ఈ తరహ చోరీలపై బ్యాంక్ అధికారులకు పలు ఫిర్యాదులు రావడంతో %ం% కంపెనీకి చెందిన పాత ఏటీయం మిషన్ స్థానంలో నూతన ఏటీయంలను ఏర్పాటు చేయడం ద్వారా చెక్ పెట్టారన్నారు. ఈ ముఠా చోరీలు చేసేందుకు అవకాశాలు సన్నగిల్లడంతో ఈ తరహా ఏటీయం మిషన్లు ఉన్న ఇతర రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, పంచిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో మొత్తం 40 కి పైగా చోరీలకు పాల్పడ్డాడరన్నారు. ఇదే తరహా చోరీలు చేసేందుకు వరంగల్ ట్రై సిటీకి రెండు కార్లలో చేరుకున్న ఈ ముఠా ముందుగా నగరంలో ఆ కంపెనీ ఏటీయంమిషన్లు ఉన్న ఏటీయం కేంద్రాలు గుర్తించి గత నవంబర్ నుండి ఇప్పటి వరకు 7 ఏటీయం కేంద్రాల్లో ఈ ముఠా సభ్యులు చోరీలకు పాల్పడ్డారన్నారు. మొత్తం 12లక్షల 10వేల రూపాయల చోరీకి చేశారన్నారు. ఇందులో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు చోరీలకు పాల్పడగా, కాజీపేట, హన్మకొండ, మీల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒకటి చోప్పున చోరీకి పాల్పడ్డారన్నారు. నగదు పోయిన విషయం ఖాతాదారు సంబంధిత బ్యాంకులలో పిర్యాదు. చేయగా, బ్యాంకు వారు థర్డ్ పార్టీ అయిన ఏటీఎం సెక్యూరిటీ, మెయింటెనెన్స్ చేసే సంస్థ అయిన ఫైనాన్సియల్ సాఫ్ట్ వెర్ సెక్యూరిటీస్ లిమిటెడ్ వాళ్లకు సమాచారం ఇవ్వగా.. వారు ఈ చోటీలపై పోలీసులకు ఫిర్యాదులు చేశారన్నారు. అప్రమత్తమైన పోలీసులు క్రైమ్స్ అదనపు డీసీపీ బాల స్వామి, క్రైమ్, కాజిపేట్ ఏసిపిలు సదయ్య, ప్రశాంత్ రెడ్డి అధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.పోలీసులకు అందుబాటులో ఉన్న టెక్నాలజీని నిందితులను వినియోగించుకున్న పోలీసులు గుర్తించి వారిపై నిఘా పెట్టడం జరిగిందన్నారు. నిందితులు ఈ రోజు ఉదయం కాజీపేట చౌరస్తా ప్రాంతంలోని ఆ కంపనీకి చెందిన ఏటీయం కేంద్రాల్లో తిరిగి చోరీ చేసేందుకు కార్లలో వచ్చి ఎవరు లేని సమయంలో డోర్ ఓపెన్ చేసి దానికి స్టికర్ అతికించిన ఐరన్ ప్లేట్ ని బిగిస్తుండగా పోలీసులు పట్టుకున్నారన్నారు. వారిని విచారించగా నిందితులు అంగీకరించారన్నారు. పాల్పడిన చోరీలను వీళ్ళ లాగే కొంత మంది రాజస్థాన్ కు చెందిన యువత ముఠాలుగా ఏర్పడి దేశంలోని వివిధ రాష్ట్రాలలో ఇలాంటి నేరాలు చేస్తున్నారన్నారు. ఇలాంటి నేరాలు జరుగుతున్నట్టు ఇప్పటి వరకు ఎక్కడ కూడా నేరాలు నమోదు కాలేదన్నారు. ఈ ముఠా సభ్యులను పట్టుకోవడం ప్రతిభ కనబరిచిన పోలీస్ ఉన్నతాదికారులతో పాటు సిసిఎస్ఇన్స్స్పెక్టర్ రాఘవేందర్, కాజీపేట్ ఇన్స్‌స్పెక్టర్ సుధాకర్ రెడ్డి, ఏఏఓ సల్మాన్ పాషా, కాజీపేట ఎస్.ఐలు నవీన్ కుమార్, లవణ్ కుమార్, సిసిఎస్ ఎస్.ఐ శ్రీనివాస్ రాజు, హెడ్ కానిస్టేబుళ్ళు మషేశ్వర్, శ్రీనివాస్ కానిస్టేబుళ్ళు విష్ణు, కుమారస్వామి, శ్రీధర్, హన్మంతు, వినోద్ లను వరంగల్ పోలీస్ కమిషనర్ అభినందించి రివార్డులను అందజేశారు.
…………………………………………………

