* పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం
ఆకేరు న్యూస్, పశ్చిమ గోదావరి జిల్లా : పశ్చిమ గోదావరి జిల్లా(West Godavari District) యండగండిలో డెడ్‌బాడీ పార్శిల్(Dedadbody Parcel) కలకలం రేపింది. తులసీ అనే మహిళ పేరుతో ఓ ఇంటికి ఈ పార్సిల్ వచ్చింది. ఆటోలో పార్సిల్ బాక్స్ ను తీసుకొచ్చి ఓ వ్యక్తి వదిలి వెళ్లాడు. పార్సిల్ బాక్స్ లో 45 ఏళ్ల వయసు ఉన్న మహిళ మృతదేహం ఉండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ (Sp)నయీమ్ అస్మి తన బృందంతో కలిసి సందర్శించారు. వివరాలు సేకరిస్తున్నారు. ఆ డెడ్ బాడీ ఎవరిది..? ఎవరు చంపారు..? ఎవరు తెచ్చారు..? అనే దానిపై సీరియస్ గా దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………………..