
* తెలంగాణలో 230 మంది పాకీస్థానీయులు
* వెంటనే తరలివెళ్లాలని ఆదేశాలు
* లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారికి మినహాయింపు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి నలుగురు పాకీస్థానీయులు పాకిస్థాన్ (Pakistan) వెళ్లిపోయారు. నలుగురిలో ఒక పురుషుడు, ఇద్దరు స్త్రీలు, ఒక బాలుడు ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ముంబై మీదుగా పాకిస్థాన్ వెళ్లారు. ఆదివారమే హైదరాబాద్ (Hyderaba) నుంచి పాకిస్థాన్ వెళ్లిపోయారు. రాష్ట్రంలో మరికొంత మంది పాకిస్థానీయులకు చెందిన పత్రాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. పాకీస్థానీయులకు కేంద్రం విధించిన డెడ్ లైన్ నేటితో ముగియనుంది. ఈ నెల 30లోపు ఆటరీ బోర్డర్ నుంచి వెళ్లాలని పాకీస్థానీయులకు పోలీసులు సూచిస్తున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు పాకీస్థానీయులకు లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ పరిధిలో 11 మందికి లాంగ్ టర్మ్ వీసా(Long Term Visa) లు, నిజామాబాద్ లో 8 మందికి లాంగ్ టర్మ్ వీసాలు, రాష్ట్ర వ్యాప్తంగా 230 మంది పాకీస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 199 మంది పాకీస్తానీయులకు లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారికి కేంద్ర హోం శాఖ మినహాయింపునిచ్చింది.
……………………………………………………