
* రెండేళ్లుగా ఆగని దాడులు
ఆకేరు న్యూస్ డెస్క్ : సూడాన్‌లో ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ దాడిలో ఏకంగా 114 మంది పౌరులు మృతి చెందారు. జామ్జామ్ ప్రాంతంలో పౌరుల శిబిరాలపై దాడిలో 100 మంది మృతి చెందారు. అబూషాక్ శిబిరంపై దాడిలో 14 మంది మృతి చెందారు. సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్(Saf), ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (Rsf) మధ్య రెండేళ్లుగా దాడులు కొనసాగుతున్నాయి. పశ్చిమ సూడాన్(Sudan)లోని నార్త్ డార్ఫర్‌లోని రెండు శిబిరాలపై కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో దాదాపు 114 మందికి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు స్టేట్ హెల్త్ అథారిటీ డైరెక్టర్ జనరల్ ఇబ్రహీం ఖతీర్ వెల్లడించారు. 2023 ఏప్రిల్ లో సూడాన్ ఆర్మీ చీఫ్ అబ్దుల్ ఫత్తా అల్ – బుర్హాన్ మాజీ డిప్యూటీ, ఆర్ ఎస్ ఎఫ్ కమాండర్ మహ్మద్ అమ్దాన్ డాగ్లోల మధ్య ఘర్షణ నెలకొనడంతో ఇరువర్గాల మధ్య దాడులు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు 29, 600 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు , కోటి మందికి పైగా సూడాన్ వదిలివెళ్లిపోయినట్లు ఐక్య రాజ్యసమితి గణాంకాలు చెబుతున్నాయి.
…………………………………..