 
                * కళాశాల వద్ద స్నేహితుల ఆందోళన
ఆకేరు న్యూస్ డెస్క్ : విశాఖ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది, విశాఖ ఎంవీపీ కాలనీలో ని సమత డిగ్రీ కాలేజీలో డిగ్రీ చదువుతున్న సాయితేజ అనే విద్యార్థి ఇద్దరు మహిళా లెక్చరర్ల లైంగిక వేధింపులతో 
ఆత్మచేసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు మహిళా లెక్చరర్లు సాయితేజను లైంగికంగా వేధించారని స్నేహితులు ఆందోళన చేశారు.తాము చెప్పినట్లుగా వినకుంటే పరీక్షల్లో మార్కులు తక్కువ వేసే వారని తెలుస్తోంది. ప్రాక్టికల్లో మార్కులు తక్కువ వేసేవారని సాయితేజ స్నేహితులు మీడియాకు తెలిపారు. సమతా కాలేజి వద్ద స్నేహితుల ఆందోళన సాయితేజ గత రెండు ఏళ్లుగా ఇలా బాధపడుతున్నాడని ఆ ఇద్దరు మహిళా లెక్చరర్ల గురించి తమతో చెప్పుకున్నాడని సాయితేజకు దగ్గరగా ఉండే స్నేహితులు చెప్తున్నారు. సాయితేజ ఆత్మహత్య విషయం తెలుకున్న స్నేహితులు కళాశాల వద్ద ఆందోళనకు దిగారు. సాయితేజ మృతికి కారకులైన ఇద్దరు మహిళా లెక్చరర్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
………………………………………..

 
                     
                     
                    