*పాడి కౌశిక్ రెడ్డిని భర్తరఫ్ చేయాలి
*మండల పార్టీ అధ్యక్షుడు సురేష్
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
అసెంబ్లీలో మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్ పూర్ శాసనసభ్యులు కడియం శ్రీహరి మాట్లాడుతుండగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు, మాట్లాడిన భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని చిల్పూర్ మండల పార్టీ అధ్యక్షుడు గడ్డమీది సురేష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ఎమ్మెల్యే బాడీ కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ నిండు సభలో ఒక దళిత ఎమ్మెల్యేను బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గన్ తో కాల్చి పడేస్తానంటూ చేయితో సైగలు చేస్తూ బెదిరించడం హేయమైన చర్యగా పరిగణిస్తున్నాం అన్నారు. అసంబ్లీలో దళితుల పట్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అగౌరవంగా, అనుచితంగా వ్యవహరించారని వెంటనే అదే సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరికి, శాసన సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని వెంటనే భర్తరఫ్ చేయాలని కోరారు . ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధ్యక్షులు నీల రాజు నియోజకవర్గ యూత్ అధ్యక్షులు ఇల్లందుల విజయ్ పిఎసిఎస్ మాజీ వైస్ చైర్మన్ నాగరాజు, పల్లగుట్ట సర్పంచ్ ఎలగందుల నర్సిరెడ్డి, ఉప సర్పంచ్ రఫీ, చిల్పూర్ సర్పంచ్ నలిమెల అనిత నవీన్, దేవస్థానం డైరెక్టర్లు రత్నాకర్ రెడ్డి, రమేష్, వాసు, రంగరాజు, మాజీ ఎంపీటీసీ ఎన్నకుస కుమార్ నాయకులు శివకుమార్, ఇల్లందుల రాజు ఇల్లందుల పెద్దరాజు, సోమరాజు, వడ్డేపల్లి పవన్, ప్రసాద్, మోటం శీను, నల్ల ఎల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు గంగుల రవీందర్ రెడ్డి, ధార రాజు, అశోక్ పాల్, కుంచాల రాజు, సంపత్ రాజు, కడారి తిరుపతిరెడ్డి, మనోజ్, యాకరాజు యువజన అధ్యక్షుడు కృష్ణ, వెంకన్న, కుంచాల రాజు కార్యకర్తలు పాల్గొన్నారు.
