* చేనేత రంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్
* మూడు రోజులుగా రిలే నిరాహార దీక్షలు
ఆకేరు న్యూస్, కరీంనగర్ : చేనేత రంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ పవర్‌లూం వస్త్ర పరిశ్రమ అనుబంధ సంస్థల ఐక్యవేదిక (జేఎసీ) గురువారం సిరిసిల్ల (Sirisilla) బంద్‌నకు పిలుపునిచ్చింది. పవర్‌లూం (Powerloom) పరిశ్రమకు 10 హెచ్‌పీ వరకు ఉచిత విద్యుత్తు అందించాలని, ఆపైన 4వ క్యాటగిరీ కింద పరిగణిం చి 50 శాతం సబ్సిడీ (Subsidy) ఇవ్వాలని, బతుకమ్మ చీరలు లేదా జనతా వస్ర్తాల పథకాలు, స్కూల్ డ్రెస్‌ల ఆర్డర్లు ఇచ్చి కార్మికులకు ఉపాధి (Employment) కల్పించాలని ఇప్పటికే మూడు రోజులుగా పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో రిలే నిరాహారదీక్షలు (Relay hunger strikes) నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో ఉందని తెలంగాణ పవర్‌లూమ్స్ వర్కర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు (Telangana Powerlooms Workers Association state president) మూషం రమేశ్ (Musham Ramesh) తెలిపారు. తక్షణమే 15 కోట్ల మీటర్ల వస్త్ర ఆర్డర్లు ఇచ్చి నేతన్నలకు ఊపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. వస్త్ర పరిశ్రమకు రావాల్సిన రూ.180 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. గురువారం నాటి బంద్‌కు వ్యాపార, వాణిజ్య వర్గాల ప్రజలు సహకరించి విజయవంతం చేయాలని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల 27న వేలాది మంది కార్మికులతో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.
——————–