* గ్రామంలో మరో 43 ఇళ్లను కూల్చివేసిన అధికారులు
ఆకేరు న్యూస్, హైదరాబాద్: పాలకులు ఆదర్శంగా ఉంటే ప్రజలు వారిని అనుకరిస్తారు
ప్రజలకు ఉపయోగపడే శాశ్వత అభివృద్ధి పనుల్లో ఆస్తులు కోల్పోవలసి వస్తే
ఆ ఆస్తులకు తగిన నష్టపరిహారం ప్రభుత్వం చెల్లిస్తుంది. అయినా తమ ఆస్తులను
కాపాడుకోవడానికి అభివృద్ధి పనులకు కోర్టుల ద్వారా ఆటంకం కల్పించేవారు ఉన్నారు
సంబంధిత అధికారులకు నోటీసులు పంపించి పనులు జరుగకుండా చేస్తారు.
కానీ సీఎం స్వగ్రామం కొండారెడ్డి పల్లె లో గ్రామ పంచాయతీ అధికారులు రోడ్డ విస్తరణలో
భాగంగా సీఎం ఇంటి ముందు ఉన్న ప్రహరీ గోడను కూల్చేస్తామని నోటీసులు ఇచ్చారు.
ఇందుకు సమ్మతించిన సీఎం అభివృద్ది పనులకు ఎలాంటి ఆటంకం రాకుండా
పనులు జరుగాలని అధికారులను ఆదేశించారు. నాలుగు లైన్ల రోడ్డు విస్తరణలో భాగంగా
అధికారులు సోమవారం సీఎం ఇంటి ప్రహరీగోడతో పాటు గ్రామంలోని 40 ఇళ్లను కూల్చేశారు
కాగా ఇళ్లు కోల్పోయిన బాధితులకు వెంటనే నష్ట పరిహారం చెల్లించాల్సిందిగా
సీఎం రేవంత్ రెడ్డి అదనపు కలెక్టర్ దేవసహాయంకు ఆదేశాలు జారీ చేశారు.
………………………………………………………………….
