
* లోక్‌సభలో స్పష్టం చేసిన కేంద్రం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. కృష్ణానదీ జలాలపై రెండు రాష్ట్రాల మధ్య వివాదం కోర్టు పరిధిలో ఉందని పేర్కొంది. కోర్టు వివాదం దృష్ట్ర్యా జాతీయ హోదా సాధ్యం కాదని జల్‌శక్తి శాఖ పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను తిరిగి పంపినట్లు కేంద్రం లోక్‌సభకు తెలిపింది. 2024 డిసెంబర్లోనే ఆ ప్రతిపాదనలను తిప్పి పంపామని లోక్‌సభలో వివరణ ఇచ్చింది. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (Mp Chamala Kirankumar reddy) ప్రశ్నకు జలశక్తి శాఖ లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చింది.
…………………………………………………………..