
* మరో మూడు రోజులు ఆస్పత్రిలోనే మార్క్ శంకర్
ఆకేరు న్యూస్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pavan Kalyan) చిన్న కుమారుడు మార్క్ శంకర్ (Mark Sankar) సింగపూర్ లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. బాలుడి ఆరోగ్యం కుదుటపడుతోందని వైద్యులు తెలిపారు. అగ్నిప్రమాదం సమయంలో కాళ్లకు కాలిన గాయాలు కావడంతోపాటు ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం కుదుట పడడంతో అత్యవసర వార్డు నుంచి సాధారణ వార్డుకు తరలించారు. కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులు, అధికారులతో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. తాజాగా వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మార్క్ కోలుకుంటున్నాడు. ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టేయడం మూలంగా తలెత్తే ఆరోగ్యపరమైన ఇబ్బందులపై పరీక్షలు చేస్తున్నామని తెలియజేశారు. మరో మూడు రోజులపాటు వైద్యులు పర్యవేక్షణలో పరీక్షలు చేయాల్సి ఉంటుందని ఆస్పత్రి వైద్యులు తెలియజేశారు. పవన్ కళ్యాణ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి సింగపూర్(Singapur) వెళ్లారు. నేరుగా ఆస్పత్రికి చేరుకొని తన కుమాడ్ని చూశారు. పవన్ (Pavan) కుమారుడిని పరామర్శించేందుకు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) దంపతులు కూడా సింగపూర్ చేరుకున్నారు. పవన్ కుమారుడి ఆరోగ్యం కుదుటపడాలని ఆశీర్వదించిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ (Jagan) కు పవన్ ధన్యవాదాలు తెలిపారు.
………………………………………….