
– ఘటన స్థలాన్ని సందర్శించిన కాజీపేట ఏసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి
ఆకేరు న్యూస్, కమలాపూర్ : కమలాపూర్ మండలం అంబాలలో గుర్తు తెలియని వ్యక్తులు కాపర్ వైర్ కోసం వ్యవసాయ మోటార్లను ధ్వంసం చేశారు. కమలాపూర్ పోలీసు ఇన్స్పెక్టర్ హరికృష్ణ కథనం ప్రకారం శనివారం రాత్రి మండలంలోని అంబాల గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీకాంత్, కుమ్మరి సాంబయ్య, గోల్కొండ అనిల్ ,గోల్కొండ రమేష్, ఉడుతనబోయిన కొమురయ్య ,మొట్టపల్లి రాజేందర్, గోల్కొండ శంకరయ్య ,మంతుర్తి రవి, జేరిపోతుల బిక్షపతిలకు చెందిన 10 కరెంట్ వ్యవసాయ మోటార్లను ధ్వంసం చేసినట్లు సిఐ తెలిపారు. మోటార్లలో ఉన్న 43 కిలోల కాపర్ తీగ విలువ 21500 రూపాయలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించగా, అంబాలా గ్రామానికి చెందిన కుమ్మరి శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిఐ తెలిపారు. కాగా ఘటన స్థలాన్ని కాజీపేట ఏసిపి పింగిలి ప్రశాంత్ రెడ్డి సందర్శించి బాధిత రైతులతో మాట్లాడారు. కేసు సత్వర చేధనకు పలు సూచనలు చేశారని సీఐ హరికృష్ణ తెలిపారు.
పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కాజీపేట ఏసీపీ
కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి కమలాపూర్ ఠాణాను ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లో రికార్డులను పరిశీలించి, సిబ్బందితో సమావేశమయై, వారి సమస్యలను తెలుసుకున్నారు.పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసు ఇన్స్పెక్టర్ హరికృష్ణ, ఎస్సై, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
……………………………………………..