* వధూవరులను ఆశీర్వదించిన సీఎం రేవంత్‌రెడ్డి
ఆకేరున్యూస్: తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి వివాహ వేడుక ఘనంగా జరిగింది. కంకిపాడులో జరిగిన ఈ వేడుకకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, మంత్రి నారా లోకేశ్‌తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ముఖ్యనేతలు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి విజయవాడ చేరుకున్న రేవంత్‌రెడ్డికి హెలిప్యాడ్ వద్ద ఏపీ మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్‌రెడ్డి స్వాగతం పలికారు.
……………………………………………………
