
* శ్రీవారికి బంగారు కఠి, వరద హస్తాలు విరాళం
ఆకేరు న్యూస్, తిరుపతి : తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి(VENKATESWARA SWAMY) వారికి శుక్రవారం ఉదయం ఓ భక్తుడు భారీగా బంగారు కానుకలు విరాళంగా అందించాడు ఓ భక్తుడు. కోల్కాతాకు చెందిన సంజీవ్ గోయెంకా (SANJIV GOYANKA) రూ.3.63కోట్లు విలువైన 5.267 కేజీల బంగారంతో వజ్రాలు, రత్నాలతో పొదిగిన కఠి, వరద హస్తాలను చేయించి స్వామివారికి సమర్పించారు. ఈ మేరకు తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి ఆభరణాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, బొక్కసం ఇన్ ఛార్జి శ్రీ గురురాజ స్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
……………………………………..