
* వేయిస్తంభాల గుడిలో ప్రత్యేకపూజలు
ఆకేరున్యూస్, వరంగల్: మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జిల్లాలోని ఆలయాలకు శివరాత్రి శోభ సంతరించుకుంది. శైవక్షేత్రాల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంది. శివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. కొన్ని ఆలయాల్లో ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రదర్శనలకు ఏర్పాట్లు చేశారు. దర్శనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా సౌకర్యాలు చేశారు. హనుమకొండలోని వేయిస్తంభాలగుడి, కాజీపేట మడికొండలోని మెట్టుగుట్ట, వరంగల్లోని భద్రకాళి ఆలయం, కాశీబుగ్గలోని కాశీ విశ్వేశ్వరాలయం భక్తులతో రద్దీగా మారింది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం రామప్పలోని రామలింగేశ్వర క్షేత్రం, మహబూబాబాద్ జిల్లా కురవి వీరభద్రుడి సన్నిధి, భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని త్రివేణి సంగమ తీరం, కాళేశ్వర ముక్తీశ్వర సన్నిధానంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శైవక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి.
…………………………..