* శాసనసభలో భూభారతి బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: ధరణి స్థానంలో భూభారతి రానుంది. శాసనసభలో భూభారతి బిల్లును రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భూభారతి బిల్లుకు సంబంధించిన ముఖ్యాంశాలను మంత్రి సభకు వివరిస్తూ.. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి స్థానంలో భూభారతిని తీసుకొస్తున్నామని.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు లిఖితపూర్వకంగా సూచించిన అంశాలను పొందుపరిచామన్నారు. ముసాయిదా బిల్లును 40 రోజులు వెబ్సైట్లో ఉంచామని.. ఎమ్మెల్యేలు, మేధావులు ఇచ్చిన అంశాలను డ్రాఫ్ట్‌లో పెట్టామన్నారు. రాష్ట్రంలోని 33 కలెక్టరేట్లలో ఒక రోజు చర్చ కూడా నిర్వహించామని.. 18 రాష్ట్రాల్లో ఆర్ఓఆర్ చట్టాలను పరిశీలించి భూభారతి తీసుకొచ్చామని వెల్లడిరచారు. 33 మాడ్యూల్స్‌తో ఉన్నదాన్ని 6 మాడ్యూల్స్‌తో పునఃప్రక్షాళన చేస్తున్నాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.
………………………………………