* వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
ఆకేరు న్యూస్, వరంగల్ :
డయల్ 100 ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. నెలవారి నేర సమీక్షా సమావేశాన్ని కాకతీయ విశ్వవిద్యాలయము సమావేశ ప్రాంగణంలో నిర్వహించారు. వరంగల్ కమిషనరేట్ చెందిన పోలీస్ అధికారులు పాల్గోన్న ఈ సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ ముందుగా సుధీర్ఘ కాలంగా పెండింగ్‌లో వున్న కేసులను సమీక్షించారు. పెండింగ్‌కు గల కారణాలను పోలీస్ కమిషనర్ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిష్కారం కోసం అధికారులు తీసుకోవాల్సిన చర్యలను పోలీస్ కమిషనర్ అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్ల కఠినంగా వ్యవహారిస్తూనే వారి కదలికలు, స్థితి గతులపై నజర్ పెట్టాలని, గత కొద్ది కాలంగా రౌడీ షీటర్లు స్థానికంగా లేకుంటే, అతను ప్రస్తుతం నివాసం వుంటున్న ప్రాంతానికి చెందిన పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. చోరీలకు పాల్పడిన నిందితులతో పాటు, గంజాయి విక్రయాలకు పాల్పడే వారిపై హిస్టరీ షీట్లను తెరవాలని సైబర్ నేరాల్లో కేవలం బాధితులు నష్టపోయిన సొమ్మును తిరిగి ఇప్పించడమే కాకుండా, నిందితుడి పట్టుకొనేందుకు స్టేషన్ అధికారులు కృషి చేయాలని, పొక్సో కేసుకు సంబంధించి చేపట్టాల్సిన చర్యలన్ని గడువు లోపు పూర్తి చేయాలని రాత్రి సమయాల్లో పెట్రోలింగ్ అధికారిగా ఎస్.ఐ స్థాయి అధికారి తప్పక విధులు చేపట్టాలని తెలపారు. చోరీలకు పాల్పడిన నిందితులను పట్టుకోవడం కోసం ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడంతో పాటు నిందితులు దేశంలో ఎక్కడ వున్న అరెస్టు చేసేందుకు పోలీస్ అధికారులు ప్రణాళికను రూపోందించుకోవాలని, కేసుల్లోని నిందితులను అరెస్టు చేయడంలో స్టేషన్ అధికారులు అలసత్వం వహించోద్దని, నేరాల నియంత్రణకై పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజల భాగస్వాయ్యంతో సిసి కెమెరాల ఏర్పాటుకై కృషి చేయడంతో సిసి కెమెరాల వినియోగం పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని, ముఖ్యంగా నిందితులకు కచ్చితంగా శిక్ష పడే రీతిలో పోలీస్ అధికారులు దర్యాప్తు చేపట్టాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో గతంలో నేర చరిత్ర వున్న వ్యక్తుల ప్రస్తుత స్థితిగతులపై వివరాలు అందుబాటులో వుండాలని, ట్రాఫిక్ ఎన్ఫోర్స్ కేసులను ట్రాఫిక్ పోలీసులతో పాటు, లా అండ్ ఆర్డర్ పోలీసులు నమోదు చేయాల్సి వుంటుందని. పోలీస్ స్టేషన్లలో ఆహ్లదకరమైన వాతవరణం కోసం మొక్కల పెంపకంతో పాటు స్టేషన్ పరిసరాల్లో పరిశుభ్రంగా వుంచాలని ఇందుకోసం ప్రతి శుక్రవారం పోలీస్ స్టేషన్ లో శ్రమదానం శ్రమదానం చేయాల్సి వుంటుందని సిపి పోలీస్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్,డిసిపి అంకిత్‌కుమార్, వరంగల్ , జనగాం ఏఎస్పీ చేతన్‌నితిన్, అదనపు డిసిపిలు రవి, ప్రభాకర్‌రావు, బాలస్వామి,తో పాటు ఏసిపిలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఎస్.ఐలు పాల్గొన్నారు.
……………………………………………..
