
* పాప ఒంటరిగా ఉంటుందని తెలిసే వచ్చారా..?
* పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు
* ఎవరితోనూ గొడవలు లేవంటున్న తల్లి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కూకట్ పల్లి సంగీత్ నగర్ లో సోమవారం ఉదయం సహస్ర అనే పన్నేండేళ్ల బాలిక హత్య పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పాప హత్య కేసును పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన సమయంలో పాప ఇంట్లో ఒక్కతే ఉంది. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న తల్లి దండ్రలు ఆ సమయంలో ఇంట్లో ఉండరని ముందే తెలిసి వచ్చారా.. ఆ కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తులకు ఇలాంటి విషయాలు తెలిసే అవకాశం ఉంది. పైగా గత నాలుగేళ్లుగా తాము ఆఫీస్కు వెళ్లినప్పుడు పిల్లలు ఒంటరిగానే ఉంటారని తల్లి చెప్తోంది. పైగా తమ కుటుంబానికి ఎవరితోనూ శతృత్వం లేదని అంటోంది. మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో పాప తండ్రి కృష్ణ ఇంటికి వచ్చే సరికి పాప విగతజీవిగా మంచంపై పడి ఉండడం చూసి తండ్రి కృష్ణ షాక్ గురై ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఘటనా స్థలాన్ని
పరిశీలించి ఫింగర్ ప్రింట్లు సేకరిస్తున్నారు.
పాప శరీరంపై పలుచోట్ల కత్తితో గాయాలు
పాప శరీరంపై పలు చోట్ల కత్తి పోట్లు ఉన్నాయి. పాపను అంతలా కత్తిపోట్లతో దాడి చేయాల్సిన అవసరం ఏముంది..అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఒక వేళ పాపపై లైంగిక దాడికి పాల్పడి పాప ఎవరికైనా చెప్తుందనే కారణంతో హత్య చేశాడా.. లేక దొంగతనానికి వచ్చి తనను చూసిన పాప పోలీసులకు తన విషయం చెప్తుందనే భయంతో చేశాడా..ఇంట్లో ఏమైనా వస్తువులు పోయాయా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. సహస్ర చదువుతున్న బోయిన్పల్లి కేవీ పాఠశాలకు ప్రస్తుతం సెలవులు ప్రకటించారు. పాపకు సెలవులు కాబట్టి పాప ఇంట్లో ఒంటరిగా ఉంటుందని ఎవరికైనా ముందే సమాచారం ఉందా.. ఎలాగైనా పాపను చంపాలని పథకం వేశారా..అనేది తెలియాలి. లేక తల్లి దండ్రలు మీద ఉన్న పగతో పాపను అంతం చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో స్థానికులతో పాటు బాధిత కుటుంబ బంధువలును కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
పెంట్ హౌస్ లో హత్య
లిఫ్ట్ లేని మూడంతుస్తుల భవనంలో పెంట్ హౌస్ లో సహస్ర కుటుంబం నివాసం ఉంటున్నారు.
దుండగుడు మెట్లపైనుండి పెంట్ హౌస్ వెళ్లే క్రమంలో ఎవరూ గమనించలేదా..హత్య జరిగినప్పుడు పాప అరుపులు ఎవరికీ విన్పించలేదా .. అరుపులు విన్పంచకుండా హంతకుడు జాగ్రత్తలు తీసుకున్నాడా అనేది అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి,. తల్లి మాత్రం తమ కుటుంబానికి ఎవరితోనూ గొడవలు లేవు అంటోంది.. తండ్రి ఇంకా షాక్ నుండి కోలుకోలేదు. పోస్టు మార్టం రిపోర్టు తెలియాల్సి ఉంది. పలు అనుమానాలకు తావిస్తున్న సహస్ర హత్య కేసును పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు తెలసుస్తోంది.
…………………………………………………….