
* నేత్ర వైద్యుడికి సైబర్ నేరగాళ్ల బెదిరింపులు
ఆకేరు న్యూస్, కొత్తగూడెం : రోజురోజుకు సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. బెంగుళూరులో థాయిలాండ్‌కు చెందిన యువతితోపాటు ఆమె స్నేహితురాలిని పోలీసులమని బెదిరించి నగ్నంగా డిజిటల్ అరెస్ట్ చేసిన ఘటన మరవక ముందే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మరో ఘటన చోటు చేసుకుంది. పోలీసులమని చెబుతూ నేత్ర వైద్యుడు నారాయణరావును బెదిరించారు. బుధవారం క్లినిక్‌లో ఉన్న సమయంలో పోలీసుల పేరుతో వీడియో కాల్ చేశారు. ఉదయం 11 గంటల నుంచి మూడు గంటల వరకు మీ పేర ఉన్న మరో ఫోన్ నెంబర్‌తో చట్ట వ్యతిరేక పనులు జరిగాయని, ఆధార్ కార్డు దుర్వినియోగమైందని, బెంగుళూరులో మీపై 17 కేసులు నమోదయ్యాయంటూ బెదిరించారు. అంతేకాకుండా డిజిటల్ అరెస్టు చేస్తున్నామని, కిటికీలు, తలుపులన్నీ మూసివేసి డిజిటల్ విచారణలో పాల్గొనాలంటూ బ్లాక్ మెయిల్ చేశారు.
…………………………………………