ఆకేరున్యూస్, హైదరాబాద్: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు నేడు ఐటీ కార్యాలయానికి వెళ్లారు. ఇటీవల దిల్ రాజు నివాసంలో ఐటీ తనిఖీలు జరిగిన విషయం తెలిసిందే. విచారణకు రావాలని ఐటీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో దిల్రాజు వ్యక్తిగత విచారణకు హాజరయ్యారు. డాక్యుమెంట్స్, బ్యాంకు వివరాలతో ఐటీ కార్యాలయానికి నిర్మాత విచారణకు వచ్చారు. వారం క్రితం దిల్ రాజు ఇంటితో పాటు అతని కార్యాలయం, వారి కుటుంబసభ్యుల నివాసాల్లో ఏకకాలంలో ఐటీ శాఖ సోదాలు చేశారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు వివరాలు, ఐదు సంవత్సరాల పాటు చెల్లించిన ఆదాయపు పన్ను వివరాలతో విచారణకు హాజరుకావాలంటూ ఆదేశాలు ఇచ్చింది ఐటీ. ఈ నేపథ్యంలో కొన్ని పత్రాలతో పాటు ఆదాయపు చెల్లింపులపై పూర్తి స్థాయి పత్రాలతో దిల్రాజు విచారణకు హాజరయ్యారు.
…………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
