* అభినందనలు తెలిపిన మంత్రి కోమటిరెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: రాష్ట్ర చలన చిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా దిల్‌రాజు బుధవారం భాద్యతలు స్వీకరించారు. మాసాబ్ ట్యాంక్‌లోని ఎఫ్.డీ.సి కార్యాలయంలో వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య పదవీ భాద్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కార్యక్రమానికి హాజరై దిల్ రాజ్‌ను అభినందించారు. తెలంగాణాలో ఫిలిం ఇండస్టీ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఇండస్టీకి చెందిన సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనివ్వడంలో దిల్ రాజు సేవలు ఎంతగానో ఉపయోగపడతాయాని ఈ సందర్బంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇండియన్ ఫిలిం ఇండస్టీకి చెందిన షూటింగ్స్ తెలంగాణలో మరింత ఎక్కువగా జరిగే విధంగా కృషి చేస్తానని దిల్ రాజ్ పేర్కొన్నారు.
……………………………………….