
* బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే
* అంతర్జాతీయ జూడో పోటీలకు ఎంపికైన అంధ విద్యార్థులను అభినందించిన బల్దియా కమిషనర్
ఆకేరున్యూస్, వరంగల్: అంతర్జాతీయ స్థాయి జూడో పోటీలకు అర్హత సాధించిన అంధ విద్యార్థులను బల్దియా కమిషనర్ డా. అశ్విని తానాజీ వాకడే సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా వరంగల్ లూయిస్ బ్రెయిలీ ఆదర్శ అంధుల పాఠశాలకు చెందిన యాజమాన్యం విద్యార్థులు సోమవారం ప్రధాన కార్యాలయంలో బల్దియా కమిషనర్ డా.అశ్విని తా నాజీ వాకడేను కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్ విజేతలుగా నిలిచిన విద్యార్థులను అభినందిస్తూ సాధించాలనే తపన ఉంటే వైకల్యం అవరోధం కాదని అంధ విద్యార్థుల సంకల్పం గొప్పగా ఉందని అంతర్జాతీయ స్థాయిలో రాణించి నగరానికి వన్నె తీసుకువచ్చారని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరాలని కమిషనర్ ఆకాంక్షించారు. అనంతరం క్రీడల్లో సాధించిన ట్రోఫీ మెడల్స్ ను కమిషనర్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ జోనా, పాఠశాల కరస్పాండెంట్ నలివేల కల్యాణి, మేనేజ్మెంట్ సభ్యులు మణిశంకర్, అంధ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………..