
* నాకు టికెట్ రాకుండా చేసింది అతడే
* మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో అభ్యర్థి ప్రకటన అసంతృప్తిని రాజేసింది. ఈ టికెట్ కోసం ఆశపడి భంగపడిన మాజీ ఎంపీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు టికెట్ రాకుండా చేసింది ఎవరో త్వరలోనే బయటపెడతానని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి ఎంపికలో తనను కనీసం సంప్రదించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. లోకల్, నాన్‌లోకల్ ఇష్యూ ఇప్పుడే ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు ఈ విషయం గుర్తుకు రాలేదా అని అంజన్‌కుమార్ యాదవ్ నిలదీశారు. తాను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్కడైనా పోటీ చేయొచ్చని స్పష్టం చేశారు అంజన్‌కుమార్ యాదవ్. ఈక్రమంలోనే ఆయన రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ సీనియర్ నేతలు అప్రమత్తం అయ్యారు. బుజ్జగింపుల పర్వంలో భాగంగా ఆయనని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రి వివేక్ వెంకటస్వామి, పలువురు నేతలు కలిశారు. ఈ క్రమంలో అంజన్ కుమార్‌తో నేతలు భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
…………………………………………………….