
* రేపటి నుంచి యధావిదిగా కళాశాలలు
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయినాయి. మొత్తం రూ. 1200 కోట్లకు పైగా ఫీజు రీఇంబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయి. మొదటి విడతగా రూ. 600 కోట్ల రూపాయలు విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది. మరో రూ. 600 కోట్లు దీపావళి పండుగకు ఇస్తామని సర్కార్ హామి ఇచ్చింది. దీంతో కళాశాలలు యథావిదిగా రేపటి నుంచి నడవనున్నాయి. దీంతో సమ్మె విరమిస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి.
—————————-