
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఇటీవల బీఆర్ ఎస్ పార్టీ నుండి బహిష్కరణకు గురైన కల్వకుంట్ల కవిత పార్టీ సభ్యత్వానికి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన విషయం తెల్సిందే. కవిత కాంగ్రెస్ లో కాని బీజేపీలో కాని చేరుతారనే ప్రచారం జరిగింది. కాగా ఆ ప్రచారాన్ని కవిత ఖండించారు. తాను ఏ పార్టీలోనూ చేరే ఉద్దేశం లేదని త్వరలో కార్యచరణను ప్రకటిస్తానని రాజీనామా చేసిన అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు.ఈ నేపధ్యంలో కవిత కొత్త పార్టీ పెడుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి,
ఇదిలా ఉండగా జూబ్లీహిల్స్ లో బీఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాత్మరణంతో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక అనివార్యమయింది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవడానికి బీఆర్ ఎస్ పట్టుదలతో ఉంది. మాగంటి సతీమణి సునీతకే టికెట్ ఖారారు చేసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి కోసం అన్వేషనలో ఉంది. జీహచ్ ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో బీజేపీ జూబ్లీహిల్స్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఎత్తులు వేస్తోంది. తాజాగా కవిత రంగంలోకి రావడంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేడి రాజుకుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఫోకస్ పెట్టినట్లు తెలిసింది. జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణు వర్దన్ రెడ్డిని బరిలో దింపడానికి కవిత ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం కవిత విష్ణువర్దన్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో విష్ణు వర్దన్ రెడ్డిని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా బరిలోకి దింపేందుకే కవిత విష్ణు వర్దన్ రెడ్డితో భేటీ అయ్యారనే చర్చ జరుగుతోంది.
…………………………………..