* 35 మందిని చైర్మన్లుగా నియమిస్తూ జీవో విడుదల
* నాలుగు నెలల నేతల నిరీక్షణకు తెర
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో నామినేటెడ్ పోస్టుల కోలాహలం మొదలైంది. నాలుగు నెలలుగా ఎదురుచూస్తున్న నేతల ఎదురుచూపులకు తెర పడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వాయిదా పడిన కార్పొరేషన్ చైర్మన్ల నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. 35 మందిని ఆయా కార్పొరేషన్లకు చైర్మన్లుగా నియమిస్తూ జీవో విడుదల చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఆశించిన నేతలు, పార్టీ కోసం దీర్ఘకాలికంగా పనిచేసున్న వారికి అవకాశం కల్పించినట్లు నేతలు చెబుతున్నారు. మార్చి 15న 35 మందితో జాబితా విడుదలైంది. వారిలో మాజీ ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, ఈరవత్రి అనిల్ కుమార్, గుర్నాథరెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సతీమణి నిర్మల, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వే్‌షరెడ్డి, నేతలు తేజావత్ బెల్లయ్య నాయక్, నేరెళ్ల శారద, శివసేనారెడ్డి, పటేల్ రమే్‌షరెడ్డి, కాల్వ సుజాత తదితరులు ఉన్నారు. వీరిలో కొందరు ఆయా కార్పొరేషన్లకు వెళ్లి చాంబర్లు కూడా చూసుకున్నారు. మరికొందరు ఆధునికీకరించుకున్నారు. కానీ, ఎన్నికల కోడ్ కారణంగా అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడంతో బాధ్యతలు స్వీకరించలేకపోయారు. ఇప్పుడు పాత జీవోనే తాజాగా విడుదల చేశారు.
చైర్మన్లు వీరే..
* మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఈరవత్రి అనిల్
* కూడా కార్పొరేషన్ చైర్మన్‌గా ఇనగాల వెంకట్రామిరెడ్డి
* గ్రామీణ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌గా చల్లా నర్సింహారెడ్డి
* టీఎస్ ఐఐసీ చైర్మన్‌గా జగ్గారెడ్డి భార్య నిర్మలా జగ్గారెడ్డి
* ఫారెస్ట్ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా పొదెం వీరయ్య
* ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్‌గా కాల్వ సుజాత
* పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా గురునాథ్‌రెడ్డి
* తెలంగాణ కో ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ ఫెడరేషన్ చైర్మన్ గా జంగా రాఘవరెడ్డి
* మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఇరవత్ అనిల్
* మైనార్టీ ఫైనాన్స్ కార్పొ్రేషన్ చైర్మన్ గా జబ్బర్
* సంగీత నాటక అకాడమీ చైర్మన్ గా అలేఖ్య పుంజాల
* ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్ మెంట్ చైర్న్గా కాసుల బాలరాజు
* విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్‌గా అన్వేష్ రెడ్డి
* రాష్ట్ర సహకార సంఘం చైర్మన్‌గా మానాల మోహన్‌రెడ్డి
* గిడ్డంగుల శాఖ చైర్మన్ గా నాగేశ్వరరావు
* గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గా రియాజ్
* మత్స్యకార సంస్థ చైర్మన్ గా మెట్టు సాయికుమార్
* ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ గా జ్ఞానేశ్వర్ ముదిరాజ్
——————————-