ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన ఏటూరునాగారం మండలంలోని చింతలకుంట,గుండంగవాయి,గంటల కుంట తదితర గ్రామాల ప్రజలకు హైద్రాబాద్ కి చెందిన రిలయబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దుప్పట్లు, స్వేటర్స్ పంపిణీ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క పాల్గొని దుప్పట్లు పంపిణీ చేశారు. ములుగు జిల్లాలో గతంలో వరదలు వచ్చినప్పుడు రిలయబుల్ ట్రస్ట్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సరుకులు, దుప్పట్లు పంపిణీ చేశారని, ములుగు జిల్లాలో వారి సేవలకు మంత్రి సీతక్క అభినందించారు. దీనిని స్పూర్తి గా తీసుకొని దాతలు ముందుకు వచ్చి పెద ప్రజలకు సహకారం అందించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీ ఎస్ , మార్కేట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణి,బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న,మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు, రవాణా శాఖ డైరెక్టర్ వసంత శ్రీనివాస్ యాదవ్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గద్దల నవీన్,మండల సీనియర్ నాయకులు , యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………………..
