
* దేశంలో తెలంగాణలో మాత్రమే పంపిణీ
* సన్నబియ్యంతో అదనంగా 2800 కోట్ల భారం
* రేపు సీఎం రేవంత్ చేతుల మీదుగా ప్రారంభం
* మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి
ఆకేరున్యూస్, సూర్యాపేట: సన్నబియ్యం పంపిణీ రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే కార్యక్రమమని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా రేపు ప్రారంభం కానుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఉగాది రోజు ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు మొత్తం కేబినెట్, ఎంపీలు హాజరుకాబోతున్నారని తెలిపారు. ప్రతి కార్యకర్త కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పేర్కొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెల్లరేషన్ కార్డ్ దారులకు మూడు రంగుల కార్డ్… ఉన్నతులకు గ్రీన్ కార్డ్ అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో 84శాతం జనాభాకు మేలు చేసే కార్యక్రమం చేపట్టబోతున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఉగాది రోజున ఆదివారం హుజూర్నగర్ వేదికగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించి ఏప్రిల్ 1 నుంచి అర్హులందరికీ రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా మరో 30 లక్షల మందిని రేషన్‌కు అర్హులుగా గుర్తించబోతున్నట్లు వెల్లడిరచారు. పేదలకు త్వరలో ఉప్పు, పప్పు, చింతపండు వంటి సరకుల్ని కూడా రేషన్‌దుకాణాల ద్వారా అందిస్తామని చెప్పారు. దొడ్డుబియ్యం స్థానంలో సన్నబియ్యం పంపిణీ వల్ల రాష్ట్రంపై రూ.2,800 కోట్ల అదనపు భారం పడనుంది. ఆ భారాన్ని భరించాలని కేంద్రాన్ని కోరామని అన్నారు. దేశంలోనే పేదలకు సన్నబియ్యం అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని అన్నారు. దేశంలో సన్నబియ్యం పంపిణీ చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ చరిత్రలో నిలవబోతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో దాదాపు 84 శాతం మంది పేదలకు ఉచితంగా సన్నబియ్యం అందించబోతున్నామని చెప్పారు. ప్రతి లబ్ధిదారుకు 6 కిలోల బియ్యం ఇస్తాం. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చని కూడా తెలిపారు. అధికారుల వద్ద ఉన్న జాబితాలో పేరుంటే కార్డులేకపోయినా రేషన్ తీసుకోవచ్చన్నారు. నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో ఇంత మంచి సంక్షేమ పథకాన్ని చూడలేదన్నారు. రేషన్‌కార్డుపై ప్రధాని ఫొటో గురించి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. కొత్తగా జారీచేసే వాటితో కలిపి రాష్ట్రంలో రేషన్‌కార్డుల సంఖ్య కోటికి, లబ్ధిదారులు 3.10 కోట్ల మంది అవుతారని అంచనా వేస్తున్నట్లు వెల్లడిరచారు. సన్నబియ్యాన్ని రాష్ట్ర అవసరాలకే వాడతాం. ఎఫ్‌సీఐకి ఇవ్వమని.. దొడ్డు బియ్యం మాత్రమే ఇస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వివరించారు.
……………………………………….