
* ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
ఆకేరున్యూస్, వరంగల్: పేదవాడి ఆకలి తీర్చేందుకు ప్రతీష్టాత్మకంగా ప్రభుత్వం సన్న బియ్యం ప్రవేశ పెట్టిందని ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి అన్నారు. నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండల ముద్దునూరు గ్రామంలో రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం పంపిణీ చేసిన సన్న బియ్యంతో ముద్దునూరు గ్రామానికి చెందిన చింత సురేష్-ఇంద్ర ఇంట్లో ఏర్పాటు చేసిన భోజనాన్ని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ,ఎంపీ పోరిక బలరాం నాయక్, జిల్లా కలెక్టర్ డా. సత్య శారద, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ ,ఆర్డిఓ కృష్ణ వేణి, అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు తోపాటు గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం… తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఉచిత సన్నబియ్యం పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు నాణ్యమైన బియ్యం అందించాలన్నదే ప్రభుత్వ ఆశయమని పేర్కొన్నారు.పేద ప్రజలు ఆకలితో బాధపడకుండా పోషకాహారాన్ని పొందాలన్నదే ఈ పథక ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే మాధవరెడ్డి వివరించారు. సన్నబియ్యం అమలులో ఎలాంటి ఇబ్బందులు లేని విధంగా చర్యలు తీసుకోవాలని,పంపిణీ వ్యవస్థలో ఎలాంటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సూచించారు. రేషన్ కార్డు లబ్ధిదారులు మాట్లాడుతూ ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేయడం,ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు ఇంతకు ముందు కిరాణా దుకాణాలలో సన్న బియ్యం కొనుగోలు చేసేవారని,ఇప్పుడు ఖరీదు చేసే అవసరం లేకుండా ప్రభుత్వం ఉచితంగా సన్న బియ్యం అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
……………………………………..